Tamilnadu: ట్రాజెడీగా మారిన కామెడీ.. ప్రదర్శన ఇస్తూ వేదికపైనే ప్రాణాలు వదిలిన స్టాండప్ కమెడియన్!

  • యూఏఈలోని దుబాయ్ లో ఘటన
  • స్టాండప్ కమెడియన్ మంజునాథ్ కు హార్ట్ అటాక్
  • దాన్ని కామెడీగా భావించి లైట్ తీసుకున్న నిర్వాహకులు
  • వేదికపైనే తుదిశ్వాస విడిచిన కమెడియన్

అందరికీ హాస్యం పంచుతున్న వేదికపై ఒక్కసారిగా విషాదం నెలకొంది. తన హాస్యచతురతతో అతిథుల్ని నవ్విస్తున్న ఓ కమెడియన్ గుండెపోటుతో వేదికపైనే కుప్పకూలాడు. అయితే దీన్ని కూడా ప్రజలు కామెడీగానే భావించడంతో అతను ప్రాణాలు కోల్పోయాడు. యూఏఈలోని దుబాయ్ లో శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

తమిళనాడులోని చెన్నైకి చెందిన మంజునాథ్ ప్రస్తుతం దుబాయ్ లో స్థిరపడ్డారు. అక్కడే స్టాండప్ కమెడియన్ గా మంజునాథ్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి ఓ హోటల్ లో ప్రదర్శన ఇస్తుండగా, మంజునాథ్ కు గుండెపోటు వచ్చింది.

ఆయన కుప్పకూలిపోగా, అది కూడా కామెడీయే అనుకుని అతిథులు, నిర్వాహకులు నవ్వుకున్నారు. అయితే మంజునాథ్ తీవ్రంగా ఇబ్బంది పడటాన్ని గమనించి ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆయన చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు.

Tamilnadu
UAE
dubai
standup comedian
heart attack
dead
manjunath
  • Loading...

More Telugu News