Drunk Driving: దొరక్కుండా ఉండేందుకు మందుబాబుల నయా ప్లాన్... వర్కవుట్ కాదంటున్న పోలీసులు!

  • మద్యం తరువాత కొత్తిమేర జ్యూస్ తాగుతున్న యూత్
  • నిమ్మరసం తాగినా చిక్కబోరంటూ ప్రచారం
  • అంతా అవాస్తవమని స్పష్టం చేస్తున్న పోలీసులు

"మందు కొట్టి, వాహనం నడుపుతున్నారా? అయితే, నిమ్మరసం లేదా కొత్తిమేర రసం తాగి వెళితే, పోలీసుల బ్రీత్ ఎనలైజర్ పరీక్షలకు చిక్కరు" ఇటీవలి కాలంలో ఈ ప్రచారం జోరందుకోగా, ఈ ప్లాన్ వర్కవుట్ కాదని, మోతాదుకు మించి మద్యం తాగితే, తప్పనిసరిగా దొరికిపోతారని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. దీన్ని నిజమని నమ్మి, నిమ్మ రసం, కొత్తిమేర రసం తాగేసి, తాము దొరకబోమని భావించి, ధైర్యంగా శ్వాస పరీక్షలను ఎదుర్కొంటున్న వారు అడ్డంగా దొరికిపోయి ఖిన్నులవుతున్నారు. తమ వాహనాలను పోలీసులకు అప్పగించేసి వెళ్లిపోతున్నారు.

వాస్తవానికి గతంలో పోలీసులు చెకింగ్ చేస్తున్నారని కనిపిస్తే, మరో మార్గం గుండా తమ వాహనాలతో ఉడాయిస్తుంటారు యూత్. అయితే, ఈ ప్రచారం ప్రారంభమైన తరువాత, దొరికిపోమన్న నమ్మకంతో పోలీసుల ముందుకు వెళ్లి, అడ్డంగా బుక్కవుతున్నారు. ఈ కారణంతోనే మే నెలలో అత్యధికులు పట్టుబడినట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఈ జ్యూస్ లతో మద్యం తాగినట్టు వాసన రాకపోవచ్చుగానీ, 100 మిల్లీ లీటర్ల రక్తంలో 30 గ్రాములకు మించిన ఆల్కహాల్ ఉంటే పట్టేస్తామని పోలీసులు అంటున్నారు. మందు కొట్టిన తరువాత ఏ జ్యూస్ తాగినా, పాన్, పాన్ మసాలాలు నమిలినా అది శ్వాస పరీక్షను ప్రభావితం చేయబోదని హెచ్చరిస్తున్నారు.

  • Loading...

More Telugu News