Andhra Pradesh: చంద్రబాబుకు వయసైపోయింది.. నారా లోకేశ్ కు వాయిసే లేదు!: బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ

  • ఏపీలో కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయింది
  • రేపు వైసీపీకీ ఇదే గతి పడుతుంది
  • చిత్తూరులో మీడియాతో ఏపీ బీజేపీ చీఫ్

ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోయిందనీ, టీడీపీ కోలుకునే పరిస్థితి లేదని ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీకి కూడా ఇదే గతి పడుతుందని వ్యాఖ్యానించారు. వస్తుసేవల పన్ను(జీఎస్‌టీ), పెద్దనోట్ల రద్దు, వెనుకబడిన వర్గాలకు చట్టబద్దత, త్రిపుల్‌ తలాక్ బిల్లు, అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత బీజేపీదేనని చెప్పారు. చిత్తూరు జిల్లా వి.కొటలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

టీడీపీ అధినేత చంద్రబాబుకు వయసు అయిపోయిందనీ, నారా లోకేశ్ కు వాయిసే లేదని కన్నా లక్ష్మీనారాయణ ఎద్దేవా చేశారు. దీనివల్ల టీడీపీ శ్రేణుల్లో నైతికస్థైర్యం దెబ్బతిందని చెప్పారు. కర్ణాటకలో కుమారస్వామి ప్రభుత్వం వెంటిలేటర్ పై నడుస్తోందని దుయ్యబట్టారు. ఈ సందర్భంగా కుప్పం, పలమనేరుకు చెందిన పలువురు టీడీపీ, కాంగ్రెస్ నేతలు బీజేపీలో చేరగా, వారికి కండువా కప్పిన కన్నా పార్టీలోకి ఆహ్వానించారు.

Andhra Pradesh
Chandrababu
Telugudesam
Congress
Nara Lokesh
YSRCP
BJP
kanna
lakshmi narayana
  • Loading...

More Telugu News