Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ లో దారుణం.. ఆఫీసులో చొరబడి బీజేపీ నేత కాల్చివేత!

  • యూపీలోని ఘజియాబాద్ జిల్లాలో అరాచకం
  • కాల్పుల అనంతరం పరారైన దుండగులు
  • నిందితుల కోసం తీవ్రంగా గాలిస్తున్న పోలీసులు

ఉత్తరప్రదేశ్ లో దారుణం చోటుచేసుకుంది. యూపీలోని ఘజియాబాద్ జిల్లా మసూరికి చెందిన బీజేపీ నేతను కొందరు దుండగులు పట్టపగలు తుపాకీతో కాల్చిచంపారు. అనంతరం ఘటనాస్థలం నుంచి పరారయ్యారు. బీజేపీ నేత బీఎస్ తోమర్ తన కార్యాలయంలో ఉండగానే కొందరు దుండగులు బైక్ పై అక్కడకు చేరుకున్నారు. అనంతరం ఆఫీసు లోపలకు వెళ్లి తోమర్ పై ఐదు రౌండ్ల కాల్పులు జరిపారు.

ఆ తర్వాత బైక్ ను అక్కడే వదిలి పారిపోయారు. కాల్పుల శబ్దం విన్న సిబ్బంది రక్తపు మడుగులో పడిపోయిన తోమర్ ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ ఆయన ప్రాణాలు కోల్పోయారు. పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలో ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో తోమర్ హత్యపై కేసు నమోదుచేసిన పోలీసులు నిందితులను పట్టుకునేందుకు గాలింపును ముమ్మరం చేశారు.

Uttar Pradesh
Police
office
BJP
leader
shot dead
  • Loading...

More Telugu News