Nagarjuna: తెలియని అమ్మాయితో మాట్లాడు... గొడవలు పెట్టుకో... దర్శకుడు రాహుల్ ను నానా ఇబ్బందులు పెట్టిన నాగార్జున... వీడియో!

  • రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన 'మన్మథుడు-2'
  • ఆగస్టు 9న విడుదలకు సిద్ధం
  • దర్శకుడితో ఫ్రాంక్ చేయించిన నాగ్

నాగార్జున హీరోగా, రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన 'మన్మథుడు-2' ఆగస్టు 9న విడుదలకు సిద్ధం కానుండగా, ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా నాగార్జున, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ను నానా ఇబ్బందులూ పెట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాహుల్ కు ఫోన్ చేసిన నాగ్, ఏం చేస్తున్నావంటూ అడిగారు. డబ్బింగ్ పనుల్లో ఉన్నానని చెప్పగా, చురకలు అంటించారు. తనకు ఇష్టమైన ఫుడ్ తేవాలని చెబుతూ, ఓ రెస్టారెంట్ కు రాహుల్ ను పంపారు., అక్కడ మరో కస్టమర్ ఆర్డర్ చేసుకున్న జ్యూస్ తాగాలని ఆర్డర్ వేశారు. వెయిటర్ తో వాదనకు దిగాలని సూచించారు. వింతైన పనులు చేయించారు. ఏ మాత్రం పరిచయం లేని ఓ యువతి రెస్టారెంట్ కు వస్తే, ఆమెతో మాటలు కలపాలని చెప్పారు. రాహుల్ ఇబ్బంది పడుతూనే నాగ్ చెప్పిన వన్నీ పూర్తి చేశారు. ఆ అమ్మాయితో ఫ్రాంక్ చేసే సమయంలో రాహుల్ కాస్తంత ఇబ్బంది పడ్డాడు. ఆపై పిచ్చి పిచ్చి పనులతో కాలం ముగించకుండా, త్వరగా సినిమా డబ్బింగ్ పనులను పూర్తి చేయాలని ఆదేశించారు.

Nagarjuna
Manmadhudu-2
Rahul Ravindran
Frank
  • Error fetching data: Network response was not ok

More Telugu News