Vinod: నడవలేని, చూడలేని స్థితిలో 'జబర్దస్త్ వినోదిని'!

  • ఓనర్ దాడిలో తీవ్రగాయాలు
  • ఇల్లు కొనే విషయంలో వివాదం
  • నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్

తన ఇంటి ఓనర్ చేసిన దాడిలో తీవ్రంగా గాయపడిన జబర్దస్త్ వినోద్ అలియాస్ వినోదిని, ప్రస్తుతం నడవలేని, చూడలేని స్థితిలో ఉన్నాడని జబర్దస్త్ మరో నటుడు శాంతి స్వరూప్ వెల్లడించారు. ప్రస్తుతం వినోద్ చేతినిండా ప్రాజెక్టులు ఉన్నాయని, వాటిని పూర్తి చేసి, జీవితంలో సెటిల్ అవ్వాలని భావిస్తున్న వేళ ఈ ఘటన జరగడంపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

వినోద్ చాలా సెన్సిటివ్‌ గా ఉంటాడని చెప్పుకొచ్చిన శాంతి స్వరూప్, ఇల్లు కొనుక్కుని అతను సెటిల్ అవుతున్నాడని సంబరపడ్డామని, అంతలోనే అతన్ని హత్య చేయాలన్న ప్రయత్నం చేశారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వినోద్ పై దాడి చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. పోలీసులు ఈ కేసును విచారించి వినోద్‌ కు న్యాయం చేస్తారన్న నమ్మకం ఉందని అన్నారు.

Vinod
Vinodini
Jabardast
Attack
Police
Hyderabad
  • Loading...

More Telugu News