Sunnyleone: సాగర కన్యగా సన్నీలియాన్... వైరల్ పిక్!

  • సాగరకన్య వేషంలో ఫొటోషూట్
  • సోషల్ మీడియాలో పోస్ట్
  • బాగున్నాయని కితాబిస్తున్న నెటిజన్లు

చాలా సంవత్సరాల క్రితం దర్శకేంద్రుడు తీర్చిదిద్దిన 'సాహసవీరుడు సాగరకన్య' చిత్రం గుర్తుందా? ఈ సినిమాలో శిల్పాశెట్టిని సాగరకన్యగా రాఘవేంద్రరావు అద్భుతంగా చూపించారు. అసలు సాగరకన్య అంటే ఇలానే ఉంటుందా? అని అనిపించేలా శిల్పా కనిపించింది కూడా. తాజాగా, సాగరకన్య అంటే తన పేరు కూడా గుర్తోచ్చేలా అందాల భామ సన్నీలియాన్ ఫొటో షూట్ చేయించుకుని, వాటిని తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేసింది. ఈ చిత్రంలో సన్నీ, సాగరకన్యగా అద్భుతంగా కనిపిస్తుండటంతో ఇవి వైరల్ అయ్యాయి. తాను సాగరకన్యగా కనిపించడాన్ని ఎంతో ఇష్టపడుతున్నానని సన్నీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది.

Sunnyleone
Sagarakanya
Mermaid
Photo Shoot
Viral photos
  • Loading...

More Telugu News