Khushi: 'ఖుషీ' సినిమా తరహాలో షీలా దీక్షిత్ ప్రేమకథ!

  • క్లాస్ మేట్ ను ప్రేమించిన ఢిల్లీ మాజీ సీఎం
  • ఫ్రెండ్స్ ప్రేమ కోసం ఏకమైన షీలా, వినోద్ దీక్షిత్
  • వినోద్ ఐఏఎస్ గా ఎంపికైన తర్వాత పెళ్లి జరిగిన వైనం

పవన్ కల్యాణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అని చెప్పుకోదగిన చిత్రం ఖుషీ. ఆ సినిమాలో పవన్ సరసన భూమిక హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలోని కాలేజ్ ఎపిసోడ్ లో బాబు, శాంతి అనే పాత్రలు ప్రేమించుకుంటాయి. ఆ ఇద్దరినీ దగ్గర చేసే క్రమంలో పవన్ కల్యాణ్, భూమిక మధ్య ప్రేమ పుడుతుంది. సరిగ్గా ఇలాంటి ప్రేమకథే ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ జీవితంలో కూడా ఉంది. షీలా ఎంఏ హిస్టరీ చదువుతున్న రోజుల్లో క్లాస్ మేట్ వినోద్ దీక్షిత్ ను మొదటిసారి చూశారు. వినోద్ ఎంతో యాక్టివ్ గా ఉండేవాడు. తొలినాళ్లలో ఇద్దరికీ పెద్దగా పరిచయం లేదు.

అయితే, షీలా స్నేహితురాలు, వినోద్ స్నేహితుడు ప్రేమించుకున్నారు. వాళ్లిద్దరి మధ్య సమస్య రావడంతో పరిష్కరించే క్రమంలో షీలా, వినోద్ మధ్య స్నేహం చిగురించింది. అది ప్రేమగా మారడం, వినోద్ ఐఏఎస్ గా ఎంపికవడం.. తర్వాత పెళ్లి జరగడం షీలా దీక్షిత్ జీవితంలో ఓ మధురఘట్టం అని చెప్పాలి. షీలా చేయందుకున్న వినోద్ ఆరోజుల్లో ఆలిండియా లెవల్లో సివిల్స్ లో 9వ ర్యాంకు సాధించడం విశేషం.

Khushi
Sheila Dixit
Vinod Dixit
Love Story
  • Loading...

More Telugu News