Andhra Pradesh: ఇంగితజ్ఞానం లేని ఇలాంటి శుంఠలు ‘దేశం’లోనే ఉంటారు.. కేశినేనిపై పీవీపీ ఘాటు విమర్శలు!

  • కర్ణాటక గవర్నర్ వజూభాయ్ వాలాను తప్పుపట్టిన కేశినేని
  • స్పీకర్ గా గతంలో పనిచేసినా నిబంధనలు తెలియనట్లు ఉంటున్నారని వ్యాఖ్య
  • కేశినేని విమర్శలకు కౌంటర్ ఇచ్చిన వైసీపీ నేత

టీడీపీ నేత, విజయవాడ లోక్ సభ సభ్యుడు కేశినేని నాని ఈరోజు కర్ణాటక గవర్నర్ వజూభాయ్ వాలా తీరుపై మండిపడ్డారు. గుజరాత్ అసెంబ్లీ స్పీకర్ గా 2012-14 సమయంలో పనిచేసిన వజూభాయ్ వాలా ఇప్పుడు కర్ణాటక గవర్నర్ గా నిబంధనలు తెలియనట్లు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, ఈ ట్వీట్లకు ప్రముఖ పారిశ్రామికవేత్త, వైసీపీ నేత పొట్లూరి వరప్రసాద్(పీవీపీ) కౌంటర్ ఇచ్చారు.

ఏ ప్రభుత్వమైనా అసెంబ్లీలో తమ మెజారిటీని నిరూపించుకోవాల్సి ఉంటుందని పీవీపీ తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబు తన భుజాలపై ఎక్కించుకుని దేశమంతా తిరిగినా, దివాళా తీసినా, యూపీఏ భాగస్వామి అయినా ఈ విషయం కొందరికి తెలియదని ఎద్దేవా చేశారు. ఇలాంటి ఇంగిత జ్ఞానం లేని శుంఠలు మన ‘దేశం’లోనే ఉంటారు అని కేశినేనిని పరోక్షంగా ప్రస్తావించారు. చట్ట సభలు నడపటానికి కోట్లు ఖర్చవుతుందనీ, కాబట్టి ప్రజాప్రతినిధులు కొంచెం కామన్ సెన్స్ తో వ్యవహరించి ప్రజా సమస్యలపై చర్చించాలని ఈ సందర్భగా పీవీపీ సూచించారు.

Andhra Pradesh
Telugudesam
Kesineni Nani
Twitter
YSRCP
PVP
  • Loading...

More Telugu News