Andhra Pradesh: కృష్ణా, గోదావరి హారతులను చంద్రబాబు షూటింగుల కోసమే ఏర్పాటుచేశారు!: మంత్రి వెల్లంపల్లి

  • మేము వాటిని శాస్త్రోక్తంగా నిర్వహిస్తాం
  • చంద్రబాబు తన అనుభవాన్ని దోపిడీకి వాడారు
  • అమరావతిలో మీడియాతో ఏపీ దేవాదాయ శాఖ మంత్రి

టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు తన అనుభవాన్ని అంతా దోపిడీకే వినియోగించారని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ విమర్శించారు. గోదావరి, కృష్ణానది హారతి కార్యక్రమాలను చంద్రబాబు షూటింగుల కోసమే ఏర్పాటు చేశారని ఎద్దేవా చేశారు. తమ ప్రభుత్వం గోదావరి, కృష్ణా హారతులను శాస్త్రోక్తంగా జరిగేలా చర్యలు తీసుకుంటుందని చెప్పారు.

అమరావతిలో ఈరోజు మంత్రి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని ఆలయాలు, మసీదులు, చర్చిలకు తగిన భద్రత కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. అలాగే అన్యాక్రాంతమైన ఆలయ భూములపై దృష్టి సారిస్తామని వెల్లంపల్లి చెప్పారు. ఇప్పటివరకూ దేవాలయాల్లో కొనసాగిన పాత కమిటీలను రద్దు చేస్తామని మంత్రి ప్రకటించారు. చంద్రబాబు చేసిన అవినీతిని ప్రజల్లోకి తీసుకెళతామని స్పష్టం చేశారు.

Andhra Pradesh
YSRCP
vellampalli
Devaswom minister
  • Loading...

More Telugu News