Jabardasth: జబర్దస్త్ టీవీ షో ఆర్టిస్ట్ వినోద్ పై దాడి

  • వినోద్ పై ఇంటి ఓనర్ దాడి
  • కాచిగూడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు
  • ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వినోద్

'జబర్దస్త్' టీవీ షో ఆర్టిస్ట్ వినోద్ పై దాడి జరిగింది. ఆయన ఉంటున్న ఇంటి ఓనర్ జరిపిన దాడిలో వినోద్ తీవ్రంగా గాయపడ్డాడు. ఎడమ కంటి భాగంపై బాగా దెబ్బలు తగిలాయి. తనపై దాడి చేసిన ఇంటి ఓనర్ పై కాచిగూడ పోలీస్ స్టేషన్ లో వినోద్ ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇంటి ఓనర్ ను పోలీస్ స్టేషన్ కు పిలిపించుకుని, విచారిస్తున్నారు. తీవ్రంగా గాయపడ్డ వినోద్ ను చికిత్స నిమిత్తం స్థానికంగా ఉన్న ఓ ఆసుపత్రికి తరలించారు.

Jabardasth
Vinod
Attack
  • Loading...

More Telugu News