Andhra Pradesh: నీతో గడిపిన ప్రతీక్షణం నాకు చాలాచాలా ప్రత్యేకం.. హ్యాపీ బర్త్ డే సితార!: మహేశ్ బాబు

  • నేడు మహేశ్ కుమార్తె సితార పుట్టినరోజు
  • కుమార్తెకు శుభాకాంక్షలు చెప్పిన మహేశ్
  • సితారతో గడిపిన టైమ్ చాలాచాలా ప్రత్యేకమని వ్యాఖ్య

టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు కుమార్తె సితార పుట్టినరోజు నేడు. ఈ నేపథ్యంలో మహేశ్ తన ముద్దుల కూతురికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘హ్యాపీ బర్త్ డే సితార..  కాలం చాలా వేగంగా గడిచిపోతోంది. నీతో గడిపిన ప్రతీ క్షణం నాకు చాలాచాలా ప్రత్యేకం. నువ్వు జీవితాంతం సుఖసంతోషాలతో, సానుకూలతతో ఉండాలని కోరుకుంటున్నా. నువ్వు ఊహించలేనంతగా నిన్ను నేను ప్రేమిస్తున్నా. గాడ్ బ్లెస్ యూ’ అని మహేశ్ ఇన్ స్టాగ్రామ్ లో తన సందేశాన్ని పోస్ట్ చేశారు.

Andhra Pradesh
Telangana
Tollywood
Mahesh Babu
sitara
Birthday
Instagram
Twitter
  • Loading...

More Telugu News