SVBC: శ్రీవెంకటేశ్వర భక్తి చానల్ చైర్మన్ గా నటుడు పృథ్వీరాజ్ నియామకం

  • తిరుపతిలో ఎస్వీబీసీ బోర్డు సమావేశం
  • పృథ్వీరాజ్ ను చానల్ చైర్మన్ గా నియమిస్తూ నిర్ణయం
  • ఈ నెల 28న ప్రమాణస్వీకారం చేయనున్న పృథ్వీరాజ్

వైసీపీ నేత, టాలీవుడ్ నటుడు పృథ్వీరాజ్ కు శ్రీవెంకటేశ్వర భక్తి చానల్ (ఎస్వీబీసీ) చైర్మన్ పదవి దక్కింది. ఇవాళ తిరుపతిలో ఎస్వీబీసీ బోర్డు సమావేశం జరగ్గా, పృథ్వీరాజ్ నియామకానికి సంబంధించిన నిర్ణయం తీసుకున్నారు. ఎస్వీబీసీ నూతన చైర్మన్ గా నియమితుడైన పృథ్వీరాజ్ ఈ నెల 28న పదవీప్రమాణస్వీకారం చేస్తారు. టీడీపీ పాలనలో ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు ఎస్వీబీసీ చైర్మన్ గా బాధ్యతలు నిర్వర్తించారు. ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలవడంతో రాఘవేంద్రరావు ఎస్వీబీసీ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. ఇప్పుడాయన స్థానంలో వైసీపీ నేత పృథ్వీరాజ్ కు చైర్మన్ పదవి లభించింది.

SVBC
TTD
Tirumala
Tirupati
Prudhvi Raj
Tollywood
Chairman
  • Loading...

More Telugu News