Telangana: నేను ఏ పార్టీలోకి పోలేను.. నన్నెవరు తీసుకున్నా మనశ్శాంతితో ఉండలేరు: సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి

  • నాతో ఇబ్బందులు ఉంటాయి
  • లేనిపోని సమస్యలు వస్తాయి
  • నా జాగాలో నేను ఉండటమే కరెక్టు

సంగారెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పార్టీ మారతారన్న వదంతులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ విషయమై ఆయన వివరణ ఇస్తూనే ఉన్నారు. తాజాగా, ఇదే అంశంపై ప్రశ్నించిన మీడియాతో జగ్గారెడ్డి మాట్లాడుతూ, తాను ఏ పార్టీలోకి పోలేనని, తనను ఏ పార్టీ వాళ్లు తీసుకున్నా మనశ్శాంతితో ఉండలేరని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ఎందుకు?‘ అన్న ప్రశ్నకు ఆయన స్పందిస్తూ, ‘నాతో ఇబ్బందులు ఉంటాయి. లేనిపోని సమస్యలు వస్తాయి. నా జాగాలో నేను ఉండటమే కరెక్టు’ అని చెప్పారు.

Telangana
Sangareddy District
mla
jagga reddy
  • Loading...

More Telugu News