Bishwabhushan: ఏపీ కొత్త గవర్నర్ ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఖరారు

  • 24వ తేదీ 10.30 గంటలకు ప్రమాణస్వీకారం
  • 23న కుటుంబసభ్యులతో కలసి ప్రత్యేక విమానంలో రేణిగుంట చేరుకోనున్న బిశ్వభూషణ్
  • తిరుమల శ్రీవారి దర్శనానంతరం విజయవాడకు పయనం

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా బిశ్వభూషణ్ హరిచందన్ నియమితులైన సంగతి తెలిసిందే. ఆయన ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఖరారైంది. 24వ తేదీ ఉదయం 10.30 గంటలకు గవర్నర్ గా ఆయన ప్రమాణస్వీకారం చేయనున్నారు. తన కుటుంబసభ్యులతో కలసి భువనేశ్వర్ నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి 23వ తేదీ ఉదయం 10 గంటలకు ఆయన రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన తిరుమల చేరుకుని శ్రీవేంకటేశ్వరస్వామివారిని దర్శించుకుంటారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుని గన్నవరం బయల్దేరుతారు. మరుసటి రోజు (24వ తేదీ) గవర్నర్ గా ప్రమాణస్వీకారం చేస్తారు.

Bishwabhushan
Andhra Pradesh
Governor
Oath
  • Loading...

More Telugu News