Telangana: ఎమ్మెల్సీ రాములు నాయక్ కు సుప్రీంకోర్టులో ఊరట

  • రాములు నాయక్ పై అనర్హత వేటు పిటిషన్ పై విచారణ
  • తుది తీర్పు వచ్చే వరకూ ఎమ్మెల్సీ ఎన్నిక జరపొద్దు
  • తెలంగాణ ప్రభుత్వానికి, మండలి చైర్మన్ కు నోటీసులు

తెలంగాణలో ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్సీ రాములు నాయక్ కు ప్రీంకోర్టులో ఊరట లభించింది. టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి ఫిరాయించారని ఆరోపిస్తూ శాసనమండలి చైర్మన్ ఆయనపై అనర్హత వేటు వేశారు. దీన్ని సవాల్ చేస్తూ రాములు నాయక్ హైకోర్టును ఆశ్రయించారు. గవర్నర్ కోటాలో ఎన్నికైన తనపై వేటు వేయడం  చట్టవిరుద్ధమని తన పిటిషన్ లో పేర్కొన్నారు. అయితే , హైకోర్టులో ఆయనకు అనుకూలంగా తీర్పు రాకపోవడంతో, సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై న్యాయస్థానం ఈరోజు విచారణ జరిపింది. రాములు నాయక్ తరపున న్యాయవాది సల్మాన్ కుర్షిద్ వాదనలు వినిపించారు. తుది తీర్పు వచ్చే వరకూ ఎమ్మెల్సీ ఎన్నిక జరపొద్దని తెలంగాణ ప్రభుత్వానికి, మండలి చైర్మన్ కు పేర్కొంటూ, న్యాయస్థానం ఈ సందర్బంగా నోటీసులు జారీ చేసింది. 

  • Loading...

More Telugu News