Andhra Pradesh: నారా లోకేశ్ మంత్రిగా వున్నప్పుడు ఐటీ శాఖలో భారీ అవినీతి జరిగింది.. దీనిపై సీబీఐ విచారణ జరపాలి!: అన్నం సతీష్

  • ఈ విషయమై ముఖ్యమంత్రి జగన్ తో మాట్లాడుతా
  • ఏపీ ఎన్నికల్లో లోకేశ్ కారణంగానే ఓడిపోయారు
  • త్వరలోనే టీడీపీ ఖాళీ అయిపోతుంది

టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేశ్ పై బీజేపీ నేత అన్నం సతీష్ మరోసారి విరుచుకుపడ్డారు. లోకేశ్ మంత్రిగా వున్నప్పుడు ఏపీ ఐటీ శాఖలో భారీగా అవినీతి చోటుచేసుకుందని సతీష్ ఆరోపించారు. ఈ విషయంలో కేంద్రంతో మాట్లాడి సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాల్సిందిగా ముఖ్యమంత్రి జగన్ ను కోరతానని చెప్పారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో లోకేశ్ కారణంగానే టీడీపీ ఓడిపోయిందని సతీష్ పునరుద్ఘాటించారు.

 నారా లోకేశ్ అవినీతిపై పూర్తిస్థాయిలో విచారణ జరగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. త్వరలోనే ఏపీలో టీడీపీ ఖాళీ కాబోతోందని జోస్యం చెప్పారు. అర్హత లేకపోయినా పార్టీని నడిపేందుకు లోకేశ్ ప్రయత్నిస్తున్నారనీ, అందుకే టీడీపీ ఓడిపోయిందని గతంలో సతీష్ ఆరోపించారు. అనంతరం టీడీపీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు.

Andhra Pradesh
Telugudesam
Nara Lokesh
CBI
COrruption
annam satish
BJP
Chief Minister
Jagan
  • Loading...

More Telugu News