Pakistan: ప్రధాని ఇమ్రాన్ ను హిట్లర్ తో పోల్చిన పాక్ నేత

  • మాజీ ప్రధాని షాహిద్ అబ్బాసీ అరెస్టుపై నిరసన
  • ప్రభుత్వ వైఫల్యాలను నిలదీస్తాం
  • మమ్మల్ని ఎవరూ అడ్డుకోలేరు:  పీఎంఎల్-ఎన్ నేత అషన్ ఇక్బాల్

పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై పీఎంఎల్-ఎన్ నేత అషన్ ఇక్బాల్ తీవ్రవ్యాఖ్యలు చేశారు. ఇమ్రాన్ ఖాన్ ని హిట్లర్ తో పోల్చారు. ఎల్ఎన్ జీ కుంభకోణం కేసులో పాక్ మాజీ ప్రధాని షాహిద్ అబ్బాసీని అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను నిలదీయకుండా తమను ఎవరూ అడ్డుకోలేరని స్పష్టం చేశారు. చట్టసభ సభ్యులను ఇమ్రాన్ ప్రభుత్వం వేధిస్తోందని ఆరోపించారు. అబ్బాసీని తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇదే అంశంపై పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) చైర్మన్ బిలావల్ భుట్టో స్పందిస్తూ, చట్టసభలకు ఎన్నికైన సభ్యులను ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం వేధిస్తోందని ఆరోపించారు. 

Pakistan
pm
Imrankhan
Ex pm
shahid abbasi
  • Loading...

More Telugu News