Cricket: ఎవరైనా కష్టపడాల్సిందే.. దానికి ప్రత్యామ్నాయం లేదు!: క్రికెటర్ విరాట్ కోహ్లీ

  • ఫిట్ నెస్ పై దృష్టి పెట్టిన విరాట్
  • వెయిట్ లిఫ్టింగ్ చేస్తూ వీడియో విడుదల
  • అభిమానులతో ట్విట్టర్ లో పంచుకున్న క్రికెటర్

భారత క్రికెట్ జట్టులో అత్యంత ఫిట్ నెస్ ఉన్న ఆటగాడు ఎవరంటే ఎవరైనా కెప్టెన్ విరాట్ కోహ్లీ అని ఠక్కున చెబుతారు. కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టినప్పటికీ విరాట్ ఒత్తిడిని తట్టుకుంటూ బ్యాటుతో రాణిస్తూనే ఉన్నాడు. ఫిట్ నెస్ వల్ల తన బ్యాటింగ్, ఫీల్డింగ్ చాలా మెరుగయిందని విరాట్ స్వయంగా పలు ఇంటర్వ్యూల్లో చెప్పాడు. తాజాగా ఆట కోసం ఫిట్ గా ఉండేందుకు తాను ఎక్సర్ సైజు చేస్తున్న వీడియోను విరాట్ కోహ్లీ ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు.

వ్యాయామంలో భాగంగా వెయిట్ లిఫ్టింగ్ చేస్తున్న వీడియోను విరాట్ అభిమానులతో పంచుకున్నాడు. దానికి ‘కష్టపడటానికి మరో ప్రత్యామ్నాయం లేదు’ అని ట్యాగ్ ను జతచేశాడు. ఈ వీడియోను నెటిజన్లు విపరీతంగా షేర్ చేస్తున్నారు.

Cricket
Virat Kohli
HARD WORK
Hard work has no substitute.
TEAM INDIA
CAPTAIN
GYM
FITNESS
WORKOUT
  • Error fetching data: Network response was not ok

More Telugu News