Uttar Pradesh: యూపీలో ప్రియాంకా గాంధీ అరెస్టుపై రాహుల్ ఆగ్రహం

  • యూపీలో భద్రతను బీజేపీ ప్రభుత్వం గాలికొదిలేసింది
  • ప్రియాంకను అరెస్టు చేయడం అక్రమం
  • అధికార అండతో ఏకపక్షంగా వ్యవహరించారు

యూపీలో ఆదివాసి రైతులను కలిసేందుకు వెళ్లిన కాంగ్రెస్ పార్టీ నేత ప్రియాంక గాంధీ వాద్రాను పోలీసులు అరెస్టు చేయడంపై రాహుల్ గాంధీ మండిపడుతున్నారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. ఆదివాసీ రైతులను పరామర్శించడానికి వెళ్లిన ఆమెను అరెస్టు చేయడం అక్రమమని, అధికారం అండతో ఏకపక్షంగా వ్యవహరించారని అన్నారు.

సొంత భూమి కోసం పోరాడుతున్న రైతులను తుపాకులతో కాల్చి చంపారని, యూపీలో భద్రతను బీజేపీ ప్రభుత్వం గాలికొదిలేసిందని దుయ్యబట్టారు. ఈ సందర్భంగా ప్రియాంక సహా మరికొంత మంది కాంగ్రెస్ నేతలు స్థానిక పోలీసులతో మాట్లాడుతున్న వీడియోను రాహుల్ షేర్ చేశారు. కాగా, యూపీలోని సోంభద్ర సమీపంలోని ఓ గ్రామంలో భూ వివాదం విషయమై రెంగు గ్రూపులు పరస్పరం కాల్పులకు పాల్పడ్డాయి ఈ ఘటనలో పది మంది మృతి చెందగా, పలువురికి గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో సోంభద్రలో ప్రియాంక గాంధీ పర్యటించారు. 

  • Loading...

More Telugu News