Varla Ramaiah: ప్రధాని మోదీ మీకు ఫ్రెండు అని చెప్పుకుంటారు కదా... ఇంకెంత కాలం మోసం చేస్తారు?: విజయసాయిపై వర్ల ఫైర్

  • కంటితుడుపు ప్రశ్నలతో కాలక్షేపం చేస్తున్నారంటూ విమర్శ
  • ప్రత్యేకహోదా విషయం ఏంచేశారంటూ నిలదీత
  • ట్విట్టర్ లో విమర్శలు చేసిన వర్ల

వైసీపీ అగ్రనేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై టీడీపీ నేత వర్ల రామయ్య తనదైన శైలిలో విమర్శలు చేశారు. కంటితుడుపు ప్రశ్నలడుగుతూ కాలం వెళ్లబుచ్చే ఎంపీ విజయసాయిరెడ్డి గారూ, ప్రధాని మోదీ మీకు ఫ్రెండు అని చెప్పుకుంటారు కదా, ప్రత్యేక హోదా విషయం ఎందుకు నాన్చుతున్నారంటూ నిలదీశారు. హోదా గురించి అడగకుండా ప్రజలను ఇంకా ఎంత కాలం మోసం చేస్తారంటూ మండిపడ్డారు. గత కొన్నిరోజులుగా ఎంపీ విజయసాయిరెడ్డి రాజ్యసభలో పలు ప్రశ్నలు అడుగుతున్న నేపథ్యంలో వర్ల పైవిధంగా స్పందించారు. చట్టసభల్లో ఓబీసీ రిజర్వేషన్లు, రాష్ట్రానికి కరవు బృందాన్ని పంపడంపైనా విజయసాయిరెడ్డి రాజ్యసభలో మాట్లాడడం తెలిసిందే.

Varla Ramaiah
Vijay Sai Reddy
Telugudesam
YSRCP
Narendra Modi
  • Loading...

More Telugu News