Andhra Pradesh: నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కూడా మాతో టచ్ లో ఉన్నారు!: బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్

  • టీడీపీ ఎమ్మెల్సీలు మాతో టచ్ లో ఉన్నారు
  • ఏపీలో నిర్మాణ రంగం కుదేలయింది 
  • విజయవాడలో మీడియాతో బీజేపీ నేత

బీజేపీ నేత, ఎమ్మెల్సీ మాధవ్ ఈరోజు సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ ఎమ్మెల్సీలు కొందరు తమతో టచ్ లో ఉన్నారని అన్నారు. కేవలం టీడీపీ నేతలే కాకుండా కాంగ్రెస్ నేత, మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కూడా టచ్ లో ఉన్నారని ప్రకటించారు. విజయవాడలో ఈరోజు మీడియాతో ఆయన మాట్లాడారు.

ఇక టీడీపీ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోలుకు సంబంధించిన పీపీఏలను సమీక్షించే అధికారం ప్రభుత్వానికి వుందన్నారు. సమీక్షించకూడదని కేంద్రం చెప్పలేదని, ఒకవేళ రద్దు చేసే పక్షంలో తగిన జాగ్రత్తలు తీసుకోమని మాత్రమే చెప్పిందని మాధవ్ అన్నారు.   అమరావతి నిర్మాణం తమ తొలి ప్రాధాన్యం కాదని సీఎం జగన్ నిర్ణయం తీసుకోవడంతో ఏపీలో నిర్మాణ రంగం కుదేలయిందని వ్యాఖ్యానించారు.

Andhra Pradesh
BJP
Telugudesam
NALLARI KIRAN KUMAR REDDY
TOUCH WITH US
MLC MADHAV
  • Loading...

More Telugu News