Andhra Pradesh: ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ అధికారులు సీఎం జగన్ ఫొటో పెట్టడానికే ఇష్టపడటం లేదట!: విజయసాయిరెడ్డి ఫైర్

  • పచ్చజీవులు ఇప్పటికైనా మారితే మంచిది
  • వీరంతా డినయలిజం నుంచి బయటపడాలి
  • ట్విట్టర్ లో విమర్శలు గుప్పించి వైసీపీ నేత

వైసీపీ నేత విజయసాయిరెడ్డి ఈరోజు విజయవాడలోని ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం అధికారులపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికైనప్పటికీ కొందరు అధికారులు ఆయన ఫొటోను విశ్వవిద్యాలయంలో పెట్టడానికి ఇష్టపడటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ పచ్చజీవులు ఇప్పటికైనా డినయలిజం నుంచి బయటపడాలని హితవు పలికారు. వీరి వ్యవహారశైలి ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ చంద్రబాబే సీఎం అన్నట్లు ఉందని ఎద్దేవా చేశారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.

Andhra Pradesh
YSRCP
Vijayawada
Twitter
Vijay Sai Reddy
NTR health university
Chief Minister
Jagan
PHOTO
DENAIL
  • Error fetching data: Network response was not ok

More Telugu News