Andhra Pradesh: ‘పోలవరం’ ఆగలేదు.. దాన్ని పూర్తిచేసేది వైసీపీ ప్రభుత్వమే!: ఏపీ మంత్రి అనిల్ కుమార్

  • పోలవరం ఆగిందని టీడీపీ విమర్శలు
  • టీడీపీ సభ్యుల ఆరోపణల్ని ఖండించిన మంత్రి
  • ప్రాజెక్టును హడావుడిగా చేపట్టబోమని వ్యాఖ్య

పోలవరం పనులను ఏపీ ప్రభుత్వం ఆపేసిందన్న టీడీపీ నేతల విమర్శలను ఏపీ జలవనరుల మంత్రి అనిల్ కుమార్ తిప్పికొట్టారు. పోలవరం పనులపై ముఖ్యమంత్రి జగన్ ఇటీవల సమీక్ష నిర్వహించారని అనిల్ గుర్తుచేశారు. పోలవరం ప్రాజెక్టును హడావుడిగా పూర్తిచేయాలని తాము అనుకోవడం లేదని స్పష్టం చేశారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సందర్భంగా టీడీపీ సభ్యుల ప్రశ్నలకు అనిల్ జవాబిచ్చారు.

2021 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి అవుతుందని మంత్రి అనిల్ తెలిపారు. ఈ విషయాన్నే అధికారులు తమకు చెప్పారన్నారు. గత ఐదేళ్ల కాలంలో ప్రాజెక్టును పూర్తి చేయడానికి టీడీపీ ప్రభుత్వం ఎలాంటి చొరవ తీసుకోలేదని మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయబోయేది వైసీపీ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. కొందరు కోర్టుకు వెళ్లి పోలవరం ప్రాజెక్టును ఆపేందుకు కుట్రలు చేస్తున్నారని అనిల్ ఆరోపించారు. అయితే వారు ఎవరో ఆయన స్పష్టత ఇవ్వలేదు.

Andhra Pradesh
YSRCP
polavaram
2021
minister
anil kumar
  • Loading...

More Telugu News