Aziz Khan: పోలీసుల అదుపులో హిందీ 'బిగ్ బాస్' మాజీ పోటీదారు అజాజ్!

  • మత కలహాలు ప్రేరేపిస్తూ పోస్టులు
  • ముంబై క్రైమ్ బ్రాంచ్ కి ఫిర్యాదులు
  • విచారించి అరెస్ట్ చేసిన పోలీసులు

 హిందీ బిగ్ బాస్ షో మాజీ పోటీదారు అజాజ్ ఖాన్ ను ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మత కలహాలను ప్రేరేపిస్తూ ఆయన అభ్యంతరకరమైన పోస్టులను, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పెట్టారన్నది ఆరోపణ. ఆయన పెట్టిన వీడియోలు, సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, అవి మతాల మధ్య కలహాలను పెంచేవిగా ఉన్నాయని ఫిర్యాదులు వచ్చాయి. దీంతో స్పందించిన ముంబై క్రైమ్ బ్రాంచ్ సైబర్ విభాగం ఆయన్ను అరెస్ట్ చేసింది. తమకు అందిన ఫిర్యాదులను పరిశీలించిన తరువాత అజాజ్ ను అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. కాగా, అజీజ్ తన వివాదాస్పద వైఖరితో గతంలో పలుమార్లు అరెస్ట్ అయ్యాడు. గత సంవత్సరం అక్టోబరులో ముంబైలోని ఓ హోటల్ లో డ్రగ్స్ వాడిన కేసులో, అంతకుముందు 2016లో ఓ బ్యూటీషియన్ కు అశ్లీల ఫోటోలు, మెసేజ్ లు పంపిన కేసులోనూ ఆయన అరెస్ట్ అయ్యాడు.

Aziz Khan
Police
Bigg boss
Arrest
Mumbai
  • Loading...

More Telugu News