PVP: రెండో చెంప చూపించను... నిన్ను వదల బొమ్మాళీ: పీవీపీ

  • విజయవాడ నేతల మధ్య ట్విట్టర్ యుద్ధం
  • నేనేమీ మహాత్ముడిని కాదు
  • పట్టు వదలని ప్రసాద్ ను నేను
  • పీవీపీ వరుస ట్వీట్లు

తాను ఒక చెంపపై కొడితే రెండో చెంపను చూపించే మహాత్ముడిని కాదని, ఎవరినీ వదలబోనని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత పీవీపీ హెచ్చరించారు. విజయవాడ రాజకీయాల్లో ట్విట్టర్ వేదికగా, గత కొన్ని రోజులుగా ఆరోపణలు, ప్రత్యారోపణలు, హెచ్చరికలు వెల్లువెత్తుతున్న వేళ, ఈ ఉదయం పీవీపీ కీలక వ్యాఖ్యలు చేశారు.

"చిల్లర వాగుడు వాగే వెధవలను వదిలేయడానికి, ఇంకో చెంప చూపించమనే, మహాత్ముడిని కాదు! చిరంజీవి గారి లాగా జెంటిల్మెన్ని కాదు. పట్టు వదలని ప్రసాద్ ని, అలియాస్ పీవీపీ. నిన్ను వదల బొమ్మాళి.. సారీ, బేతాళ" అని ట్వీట్ చేశారు. అంతకుముందు, "కలవరమాయే మదిలో!!! నా మదిలో.. కన్నుల్లో మనస్సే ప్రేమ మందిరమాయే.. ఆ ప్రియుడు ఎవరు రాజా??? చంద్రబాబా.. ఇంకొకరా? కలికాలం సుమీ.. ఏమిటి రంకు.. బొంకు??" అని ఇంకో ట్వీట్ పెట్టారు.

దానికన్నా ముందు, "తాతల సొమ్ముతో సోకులు చేసే వేలిముద్ర గాడిని కాదు. వేల కోట్లతో వ్యాపారాలు  చేసి వేలాది ఉద్యోగాలు సృష్టించాము. వేల కోట్లు బ్యాంకులకు ఎగ్గొట్టడమెలాగో మీ "గురువు"గారిని  అడిగి చెపితే మేము ఆ కొత్త బిజినెస్ నేర్చుకుంటాము" అని అన్నారు. 

PVP
Twitter
Tweets
  • Error fetching data: Network response was not ok

More Telugu News