Karnataka: రసకందాయంలో కర్ణాటకం: బీజేపీ నిరసన.. శాసనసభలోనే నిద్రపోయిన సభ్యులు

  • విశ్వాస పరీక్ష జరగకుండానే సభ వాయిదా
  • ఆందోళనకు దిగిన బీజేపీ
  • మరి కాసేపట్లో సభ ప్రారంభం

గత నెలరోజులుగా కర్ణాటక రాజకీయాలు సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపిస్తున్నాయి. ఎమ్మెల్యేల రాజీనామా, బుజ్జగింపులు, బేరసారాలు.. తదితర వాటితో రసకందాయంగా మారిన కర్ణాటక రాజకీయం క్లైమాక్స్‌కు చేరుకుంది. విశ్వాస పరీక్షకు ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి సిద్ధమైనా గురువారం అది జరగకుండానే సభ నేటికి వాయిదా పడింది. దీంతో విశ్వాస పరీక్ష జరగకుండా సభను ఎలా వాయిదా వేస్తారంటూ బీజేపీ ఆందోళనకు దిగింది.

గురువారం రాత్రి బీజేపీ సభ్యులు విధాన సభలోనే నిద్రించారు. ఉదయం లేచి కాసేపు వాకింగ్ చేసి కాలకృత్యాలు తీర్చుకున్నారు. మరికాసేపట్లో సభ తిరిగి ప్రారంభం కానున్న నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. కాంగ్రెస్ నేతలతో సమావేశమైన సిద్ధరామయ్య విప్ అంశంపై సుప్రీంకోర్టు తీర్పును సవాలు చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.

Karnataka
BJP
Congress
  • Loading...

More Telugu News