Thamanna: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • తమన్నా చిత్రానికి తమాషా టైటిల్ 
  • సీక్వెల్ గా 'డబుల్ ఇస్మార్ట్' 
  • బోయపాటి దర్శకత్వంలో మళ్లీ బన్నీ

*  ఏ భాషలో అవకాశాలు వస్తే అక్కడ సినిమాలు చేసేస్తోన్న కథానాయిక తమన్నా తాజాగా తమిళంలో ఓ హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాన్ని చేస్తోంది. రోహిన్ వెంకటేశన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి 'పెట్రోమాక్స్' అనే గమ్మత్తయిన టైటిల్ని నిర్ణయించారు.
*  పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరోగా రూపొందిన 'ఇస్మార్ట్ శంకర్' చిత్రం నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో దర్శకుడు పూరి ఈ చిత్రానికి సీక్వెల్ ను ప్రకటించారు. 'డబుల్ ఇస్మార్ట్' పేరిట ఇప్పటికే సీక్వెల్ కు టైటిల్ని రిజిస్టర్ చేశానని చెప్పారు.
*  బోయపాటి శ్రీను దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా ఓ భారీ చిత్రాన్ని నిర్మించడానికి గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. గతంలో బోయపాటి, బన్నీ కలయికలో 'సరైనోడు' సినిమా వచ్చిన సంగతి విదితమే. 

Thamanna
Puri Jagannadh
Ram
Boyapati Sreenu
Bunny
  • Loading...

More Telugu News