Andhra Pradesh: 'ఎన్ కౌంటర్ల' కేసులో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు సుప్రీంకోర్టులో చుక్కెదురు!

  • ఎన్‌కౌంటర్లపై గతంలో హైకోర్టులో పిటిషన్
  • పిటిషన్ దార్లకు అనుకూలంగా హైకోర్టు తీర్పు
  • సుప్రీంను ఆశ్రయించిన ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు

ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఎన్‌కౌంటర్లపై గతంలో పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు ఎన్‌కౌంటర్లపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందేనంటూ ఆదేశాలు జారీ చేసింది. దీనిని సవాల్ చేస్తూ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలతో పాటు ఏపీ పోలీస్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌‌కు అక్కడ కూడా చుక్కెదురైంది. పోలీసులు చేసే ఎన్‌కౌంటర్లపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాల్సిందేనంటూ తెలంగాణ, ఏపీ రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీం ఆదేశాలు జారీ చేస్తూ నేడు తీర్పును వెలువరించింది.

Andhra Pradesh
Telangana
FIR
Encouters
Supreme Court
High Court
  • Loading...

More Telugu News