Andhra Pradesh: బాంబే జయశ్రీకి 'మంగళంపల్లి బాలమురళీకృష్ణ' పేరిట ఏపీ ప్రభుత్వం అవార్డు

  • దివంగత కర్ణాటక సంగీత విద్వాంసుడు మంగళంపల్లి  
  • ఈ అవార్డు కింద రూ.10 లక్షల పారితోషికం
  • ఏపీ టూరిజం మంత్రి అవంతి శ్రీనివాస్ ప్రకటన 

దివంగత కర్ణాటక సంగీత విద్వాంసుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ పేరిట అవార్డు ఇవ్వనున్నట్టు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు టూరిజం శాఖా మంత్రి అవంతి శ్రీనివాస్ ఓ ప్రకటన చేశారు. ఈ అవార్డు కింద రూ.10 లక్షల పారితోషికం ఇచ్చి, ఘనంగా సన్మానించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు చెప్పారు. తొలిసారిగా ఈ అవార్డుకు కర్ణాటక సంగీత స్వరకర్త, గాయకురాలు బాంబే జయశ్రీని ఎంపిక చేసినట్టు తెలిపారు. రాష్ట్రంలో టూరిజంను అభివృద్ధి చేస్తామని, వచ్చే నెల నుంచి జిల్లాల్లో టూరిజం పనులను పరిశీలిస్తానని చెప్పారు. విజయవాడలోని బాపు మ్యూజియం, ఏలూరు మ్యూజియంలను ఏప్రిల్ లో ప్రారంభిస్తామని, గుంటూరు జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రం కోటప్పకొండ రోప్ వేను త్వరలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.

  • Loading...

More Telugu News