Jagan: టీడీపీ కులాల పేరుతో రాజకీయాలు చేస్తే.. వైసీపీ మతం పేరుతో సమాజాన్ని విడదీస్తోంది: పురందేశ్వరి

  • జగన్‌కు మెయిల్ వస్తే చర్చిలకు భద్రత కల్పించారు
  • అఖిలపక్షంతో చర్చించాకే నిర్ణయం తీసుకోవాలి
  • ప్రధాని స్కూటీ ఇస్తారన్న ప్రచారంలో వాస్తవం లేదు

ఏపీ సీఎం జగన్‌కు ఏదో మెయిల్ వస్తే, విశాఖలో చర్చిలకు మాత్రమే పోలీసు భద్రత కల్పించారని, ఇలాంటి విధానాలను ప్రజలు గమనిస్తున్నారని బీజేపీ నేత పురందేశ్వరి పేర్కొన్నారు. టీడీపీ కులాలు, కార్పొరేషన్ల విభజన పేరుతో రాజకీయాలు చేస్తే, వైసీపీ మతం పేరుతో సమాజాన్ని విడదీస్తోందని ఆమె ఆరోపించారు. అఖిలపక్షంతో చర్చించిన తరువాతే తెలంగాణతో కలిసి గోదావరి జలాలను తరలించే విషయంపై నిర్ణయం తీసుకోవాలని పురందేశ్వరి జగన్‌ను కోరారు. పదో తరగతి పూర్తయిన అమ్మాయిలకు ప్రధాని స్కూటీ ఇస్తారన్న ప్రచారంలో వాస్తవం లేదని పురందేశ్వరి స్పష్టం చేశారు.

Jagan
Vizag
Police
Purandeswari
Telugudesam
Corporations
Telangana
  • Loading...

More Telugu News