Karnataka: విశ్వాసపరీక్ష రేపటికి వాయిదా.. రాత్రంతా ఇక్కడే ఉంటామన్న యడ్యూరప్ప!

  • విశ్వాసపరీక్ష నిర్వహించాలని బీజేపీ పట్టు
  • వాయిదాపడిన సభలోనే బైఠాయింపు
  • అర్ధరాత్రి పన్నెండైైనా సరే ఓటింగ్ చేపట్టాల్సిందేనన్న యడ్డీ

కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వంపై ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానంపై సుదీర్ఘ చర్చ సందర్భంగా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో, విశ్వాసపరీక్షను రేపటికి వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ రమేశ్ ప్రకటించారు. రేపు ఉదయం 11 గంటలకు తిరిగి సభ ప్రారంభం కానుంది.

సభ వాయిదా పడిన అనంతరం కాంగ్రెస్, జేడీఎస్ సభ్యులు బయటకు రాగా, బీజేపీ సభ్యులు మాత్రం అక్కడే ఉండిపోయారు. ఈరోజే విశ్వాసపరీక్ష జరగాలని పట్టుబట్టిన బీజేపీ సభ్యులు స్పీకర్ ప్రకటనపై నిరసన వ్యక్తం చేశారు. వాయిదాపడిన సభలోనే బైఠాయించారు. రాత్రంతా ఇక్కడే ఉంటామని యడ్యూరప్ప వ్యాఖ్యానించారు. అర్ధరాత్రి పన్నెండు గంటలైనా సరే ఓటింగ్ చేపట్టాల్సిందేనని అన్నారు. గవర్నర్ ఆదేశించినా ఓటింగ్ జరపడం లేదంటూ స్పీకర్ కు వ్యతిరేకంగా బీజేపీ సభ్యులు నినదించారు.

Karnataka
Assembly
Bjp
Yedurappa
  • Loading...

More Telugu News