KCR: గవర్నర్‌తో కేసీఆర్ భేటీ.. కీలక విషయాలపై చర్చ

  • శాసనసభ వాయిదా అనంతరం గవర్నర్‌తో భేటీ
  • శాసనసభ ప్రత్యేక సమావేశాలపై చర్చ
  • నీటి వివరాలను తెలిపిన కేసీఆర్

రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశానంతరం జరిగిన పరిణామాల్ని సీఎం కేసీఆర్ నేడు గవర్నర్ నరసింహన్ దృష్టికి తీసుకెళ్లారు. నేడు శాసనసభ వాయిదా పడిన అనంతరం నేరుగా రాజ్‌భవన్‌కు వెళ్లిన కేసీఆర్ ఆయనతో కాసేపు సమావేశమయ్యారు. ఇరువురి మధ్య రాష్ట్రంలోని తాజా పరిణామాలపై చర్చ జరిగినట్టు తెలుస్తోంది.

శాసనసభ ప్రత్యేక సమావేశాలు, కొత్త పురపాలక చట్టం, పురపాలక ఎన్నికలు తదితర అంశాలపై ఇరువురి మధ్య చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకూ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎత్తిపోసిన నీటి వివరాలను కూడా కేసీఆర్ గవర్నర్‌కు వివరించినట్టు సమాచారం. ఏపీకి ప్రత్యేక గవర్నర్ నియామాకానంతరం జరిగిన భేటీ కావడంతో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

KCR
Narasimhan
Rajbhavan
Assembly
Muncipal Elections
Kaleswaram
  • Loading...

More Telugu News