NSE: అమెరికా-చైనా వాణిజ్యపోరు.... నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్
- పతనం దిశగా సాగిన మార్కెట్ సూచీలు
- నష్టాలు చవిచూసిన యస్ బ్యాంక్, ఓఎన్ జీసీ, మారుతి
- లాభాలు ఆర్జించిన విప్రో, హెచ్ డీఎఫ్ సీ
అమెరికా, చైనా దేశాల మధ్య కొనసాగుతున్న వాణిజ్య యుద్ధం అంతర్జాతీయంగా ప్రభావం చూపిస్తోంది. ఈ నేపథ్యంలో, భారత స్టాక్ మార్కెట్ సూచీలు సైతం నేడు పతనం దిశగా సాగాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 318.18 పాయింట్లు నష్టపోయి 38,897.46 వద్ద స్థిరపడగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 90 పాయింట్ల నష్టంతో 11,596.90 వద్ద ముగిసింది. యస్ బ్యాంక్, ఓఎన్జీసీ, మారుతి సంస్థల షేర్లు నష్టాలు చవిచూడగా, విప్రో, హెచ్ డీఎఫ్ సీ, జీ ఎంటర్టయిన్ మెంట్, బ్రిటానియా షేర్లు లాభాల బాటలో పయనించాయి. కాగా, డాలర్ తో రూపాయి మారకం విలువ రూ.68.96గా కొనసాగుతోంది.