Andhra Pradesh: జగన్ ప్రభుత్వం నదీ తీరాల్లోని 73,000 కట్టడాలను కూల్చాలని నిర్ణయించుకుంది!: గోరంట్ల బుచ్చయ్య చౌదరి

  • సీఎం జగన్ ఫ్యాక్షన్ నేతగానే వ్యవహరించారు
  • కృష్ణలంకను, గోదావరిలోని ఆధ్యాత్మిక కేంద్రాలను తొలగిస్తారా?
  • ఏపీ ముఖ్యమంత్రిని ప్రశ్నించిన టీడీపీ నేత

ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి తీవ్రంగా మండిపడ్డారు. గత 40 రోజుల పాలనలో జగన్ ఫ్యాక్షన్ నేతగానే వ్యవహరించారని ఆయన విమర్శించారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

ప్రజావేదిక తరహాలో నదీ తీరాల్లో ఉన్న 73,000 కట్టడాలను కూల్చాలని జగన్ ప్రభుత్వం చూస్తోందని బుచ్చయ్య చౌదరి ఆరోపించారు. విజయవాడలోని కృష్ణలంకను, గోదావరి తీరంలోని వివిధ మతాల ఆధ్యాత్మిక కేంద్రాలనూ ప్రభుత్వం తొలగించగలదా? అని ప్రశ్నించారు. సీఎం జగన్ ఒక్కో తప్పుకు మరో వంద తప్పులు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. 

Andhra Pradesh
Chandrababu
Telugudesam
Gorantla Butchaiah Chowdary
YSRCP
Jagan
Chief Minister
  • Loading...

More Telugu News