New Delhi: బస్సులో హరియాణీ పాటకు చిందేసిన యువతి.. ఊడిన డ్రైవర్ ఉద్యోగం!

  • దేశరాజధాని ఢిల్లీలోని జనక్ పురి ప్రాంతంలో ఘటన
  • గత నెల 12న బస్సులో డ్యాన్స్ చేసిన యువతి
  • ఎంజాయ్ చేసిన డ్రైవర్, కండక్టర్, మార్షల్.. ఉన్నతాధికారుల ఆగ్రహం

బస్సులో ఓ యువతి హ్యాపీ మూడ్ లో డ్యాన్స్ చేసిన పాపానికి ఆ బస్సును నడిపిన డ్రైవర్, అందులోని కండక్టర్ పై ఢిల్లీ రవాణా సంస్థ కొరడా ఝుళిపించింది. డ్రైవర్ ను సస్పెండ్ చేసిన సంస్థ, కండక్టర్ కు షోకాజ్ నోటీసులు జారీచేసింది. గత నెల 12న జనక్ పురి ప్రాంతంలోని బస్సులో ఓ యువతి హరియాణీ పాటకు డ్యాన్స్ వేసింది.

ఈ సందర్భంగా ఆమె పక్కన బస్సులో మార్షల్ ఉన్నారు. అయితే డ్రైవర్, కండక్టర్, మార్షల్ ఆమెను అడ్డుకోవడం పక్కనపెట్టి డ్యాన్స్ ను ఎంజాయ్ చేయడం మొదలుపెట్టారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అధికారులు కన్నెర్ర చేశారు. ఢిల్లీ రవాణా సంస్థ(డీటీసీ)కి అప్రతిష్ఠ తీసుకొచ్చారంటూ డ్రైవర్ పై సస్పెన్షన్ వేటు వేశారు. కండక్టర్ కు షోకాజ్ నోటీసు ఇచ్చి, మార్షల్ ను తిరిగి సివిల్ డిఫెన్స్ కార్యాలయానికి అటాచ్ చేశారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News