Vijay Malya: విజయ్ మాల్యాకు భారీ ఊరట... ఫిబ్రవరి వరకూ విచారణ లేనట్టే!

  • తన అప్పగింత నిర్ణయాన్ని సవాల్ చేసిన మాల్యా
  • కేసు విచారణ ఫిబ్రవరి 11కు వాయిదా 
  • 11 నుంచి మూడు రోజుల పాటు విచారిస్తామన్న కోర్టు

ఇండియాలోని బ్యాంకులను వేల కోట్లకు ముంచి, లండన్ లో తలదాచుకున్న యూబీ గ్రూప్ మాజీ చైర్మన్ విజయ్ మాల్యాకు భారీ ఊరట లభించింది. తనను ఇండియాకు తిరిగి అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ, మాల్యా కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై ఇప్పట్లో విచారణ జరగబోదు. ఈ కేసు విచారణను ఇప్పట్లో చేపట్టలేమని, వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో విచారిస్తామని యూకే కోర్టు గురువారం నాడు స్పష్టం చేసింది. ఫిబ్రవరి 11 నుంచి మూడు రోజుల పాటు కేసును విచారించేలా లిస్టింగ్ చేస్తున్నామని పేర్కొంది.

కాగా, మాల్యాను భారత్ కు అప్పగించాలని వెస్ట్ మినిస్టర్ కోర్టు నిర్ణయించిన తరువాత, ఆయన రాయల్ కోర్ట్స్ ఆఫ్ జస్టిస్ ను ఆశ్రయించగా, అపీల్ చేసుకునేందుకు మాల్యాకు అవకాశమిచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై ఆయన అపీలుకి వెళ్లగా, తాజా నిర్ణయం వెలువడింది. కాగా, తాను ఇండియాలో బ్యాంకులకు డబ్బులు కడతానని చెబుతున్నా, బ్యాంకులు వినడం లేదని, తన నుంచి బకాయిలు రాబట్టుకోవడం కన్నా, తనను ఇండియాకు తీసుకెళ్లి జైల్లో పెట్టించాలన్న లక్ష్యంతోనే ఉన్నాయని మాల్యా విమర్శిస్తున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News