Telangana: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. పురపాలక బిల్లును ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్!
- నేడు బిల్లుపై సవరణల స్వీకరణ
- రేపు అసెంబ్లీలో చర్చ నిర్వహణ
- మెడికల్ కాలేజీల ప్రొఫెసర్లకు వయోపరిమితి పెంపుపై మరో బిల్లు
తెలంగాణ పురపాలక చట్టం-2019 బిల్లును ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈరోజు సాయంత్రం వరకూ ఈ బిల్లుపై సవరణలను స్వీకరించనున్నారు. అనంతరం రేపు ఈ బిల్లుపై చర్చ జరగనుంది. గతంలో జారీచేసిన నాలుగు ఆర్డినెన్సుల స్థానంలో ఈ బిల్లును ప్రభుత్వం తీసుకొచ్చింది.
ఈ సందర్భంగా మెడికల్ కాలేజీల్లో బోధనా సిబ్బంది పదవీవిరమణ వయసును పెంచే బిల్లును కూడా సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ లో విలీనం చేసుకోవడాన్ని కాంగ్రెస్ సభ్యుడు భట్టి విక్రమార్క ప్రస్తావించారు. అయితే ఈ విషయం న్యాయస్థానం ముందు ఉన్నందున దానిపై చర్చకు అనుమతించబోమని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు.