Rajagopal: 'శరవణ భవన్' రాజగోపాల్ కన్నుమూత

  • ఇటీవలే జీవితఖైదు అనుభవించేందుకు జైలుకు
  • గుండెపోటులో ఆసుపత్రిలో చేరిక
  • ఈ ఉదయం పరిస్థితి విషమించి మృతి

 తన వద్ద పనిచేస్తున్న వ్యక్తిని హత్య చేయించి, జీవితఖైదు పడగా, గతవారంలో శిక్షను అనుభవించేందుకు జైలుకు వెళ్లి, ఆపై గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన 'దోశ కింగ్', ప్రఖ్యాత హోటల్ చైన్ శరవణ భవన్ యజమాని రాజగోపాల్ మరణించారు. చెన్నైలోని అసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ ఉదయం ఆయన కన్నుమూశారు. ఆయన తీవ్రమైన గుండెపోటుతో ఆసుపత్రికి వచ్చారని, పరిస్థితి విషమించి మరణించారని వైద్య వర్గాలు తెలిపాయి. దీంతో తన వద్ద పనిచేస్తున్న మహిళా ఉద్యోగిని పెళ్లాడితే, మరింత కలిసి వస్తుందని జ్యోతిష్యుడు చెప్పిన దానిని నమ్మి, ఆమె భర్తను కిరాయి గుండాలతో దారుణంగా హత్య చేయించిన రాజగోపాల్‌ కథ ముగిసింది.

  • Error fetching data: Network response was not ok

More Telugu News