Telangana: తెలంగాణ సీఎం కేసీఆర్ కు మావోయిస్టుల వార్నింగ్!

  • ఆదివాసీల భూములను కబ్జా చేస్తున్నారు
  • రెండోసారి గెలిచినా పోడు భూములకు  పట్టాలు ఇవ్వలేదు
  • లేఖ విడుదల చేసిన మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు మావోయిస్టులు హెచ్చరికలు జారీచేశారు. హరితహారం పథకం పేరుతో కేసీఆర్ ప్రభుత్వం ఆదివాసీల భూములు కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తోందని మావోలు ఆరోపించారు. దశాబ్దాలుగా ఆదివాసీలు సాగు చేసుకుంటున్న పోడు భూములకు పట్టాలు ఇస్తామన్న కేసీఆర్, రెండోసారి అధికారంలోకి వచ్చాక కూడా మాట తప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ మేరకు మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్ పేరిట లేఖ విడుదల అయింది . కేసీఆర్ ఇప్పటికైనా తన వైఖరిని మార్చుకోవాలనీ, లేదంటే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని లేఖలో జగన్ హెచ్చరించారు. దీంతో అప్రమత్తమైన తెలంగాణ పోలీసులు, గ్రేహౌండ్స్ బలగాలు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కూంబింగ్ ను ముమ్మరం చేశారు.

Telangana
Warangal Rural District
maoist
Police
warning
KCR
Chief Minister
letter
  • Loading...

More Telugu News