Chandrababu: ఆ మాటన్నందుకు జగన్ ను అభినందిస్తున్నా... నేను చేసిన తప్పు మాత్రం ఇదే: చంద్రబాబునాయుడు

  • కరకట్టపై కట్టడాలతో నది దిశ మారుతుందన్న జగన్
  • జగన్ మాటలు వాస్తవమేనని అంగీకరించిన చంద్రబాబు
  • ప్రజావేదిక కావాలని లేఖ రాసి తప్పు చేశానని వెల్లడి

అక్రమ కట్టడాలపై అసెంబ్లీలో చర్చ జరుగుతున్న వేళ, జగన్ చేసిన వ్యాఖ్యలను తాను స్వాగతిస్తున్నానని చంద్రబాబు వ్యాఖ్యానించారు. నదీ పరీవాహక ప్రాంతాల్లో తీరంపై కట్టడాల వల్ల నది దిశను మార్చుకుంటుందని, వరదలు వచ్చే ప్రమాదం ఉందని జగన్ చెప్పిన మాటలు కరెక్టని, ఈ విషయంలో తాను జగన్ ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని అన్నారు.

ఇదే సమయంలో మాజీ సీఎం భవనాన్నే కూల్చేస్తున్నామని, మీదో లెక్కా? అని పేదలు, తీర ప్రాంతంలో చిన్న చిన్న ఇళ్లు కట్టుకుని నివసిస్తున్న వారిలో తీవ్ర భయాందోళనలను పెంచుతున్నారని మండిపడ్డారు. ప్రజావేదిక కూల్చివేతను ప్రస్తావిస్తూ, అసెంబ్లీ ఎన్నికల తరువాత తాను ఓ తప్పు చేశానని, ప్రజా వేదికను తమకు కేటాయించాలని కోరడం తప్పయి పోయిందని చంద్రబాబు అన్నారు. తాను లేఖ రాయకుండా ఉండివుంటే, ప్రజావేదికను కూల్చివుండేవారు కాదని ఆయన అభిప్రాయపడ్డారు. అదే తాను చేసిన తప్పయిపోయిందని, తానున్న ఇంటిని కూల్చేస్తే, రోడ్డుపై పడుకుంటానే తప్ప ఎవరికీ భయపడేది లేదని హెచ్చరించారు.

  • Loading...

More Telugu News