Venkaiah Naidu: హృతిక్ రోషన్ నటించిన సినిమాను చూసిన ఉపరాష్ట్రపతి

  • బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్న 'సూపర్ 30'
  • ఉపరాష్ట్రపతి భవన్ లో వెంకయ్యనాయుడి కోసం ప్రత్యేక ప్రదర్శన
  • గొప్ప చిత్రాన్ని తెరకెక్కించారంటూ ఉపరాష్ట్రపతి కితాబు

బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ నటించిన 'సూపర్ 30' చిత్రం హిట్ టాక్ తెచ్చుకుంది. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం సందడి చేస్తోంది. తాజాగా ఈ చిత్రాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తన కుటుంబంతో కలసి వీక్షించారు. వెంకయ్య దంపతుల కోసం ఉపరాష్ట్రపతి భవన్ లో ప్రత్యేకంగా చిత్రాన్ని ప్రదర్శించారు. అనంతరం హృతిక్ రోషన్, చిత్ర నిర్మాత సాజిద్ నడియాడ్ వాలా, మధు మంతెన, ఒరిజినల్ ఆనంద్ కుమార్ తో కలసి ఫొటో దిగారు. ఈ పిక్ ను ఉపరాష్ట్రపతి ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. ఆనంద్ కుమార్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే.

పేద విద్యార్థులకు బంగారు భవిష్యత్తును అందించే క్రమంలో ఆనంద్ ఎన్నో ఒడిడుడుకులు ఎదుర్కొన్నారని... ఆయన జీవితం స్ఫూర్తిదాయకమని ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు ట్వీట్ చేశారు. గొప్ప చిత్రాన్ని తెరకెక్కించారని కితాబిచ్చారు.

Venkaiah Naidu
Hrithik Roshan
Super 30
Bollywood
  • Loading...

More Telugu News