Turkey: యువతి పాలిట భయానకంగా మారిన తొలి విమాన ప్రయాణం... వీడియో!

  • కన్వేయర్ బెల్ట్ పైకి దూకేసిన యువతి
  • దానిపై నిలబడితే విమానం వద్దకు వెళ్లొచ్చని అనుకుందట
  • వైరల్ అవుతున్న వీడియో

మొదటిసారిగా విమానం ఎక్కేందుకు వెళ్లిన అనుభవం జీవితాంతం గుర్తుండిపోతుంది. కానీ, ఓ యువతి మాత్రం భయంకర అనుభవాన్ని ఎదుర్కొంది. విమానం ఎలా ఉంటుంది? విమానాశ్రయంలోకి ఎలా వెళ్లాలి? విమానం వద్దకు ఎలా చేరుకోవాలి? ఇటువంటి విషయాలపై అవగాహన లేని ఆమె గాయాలపాలైంది. టర్కీ ఎయిర్ పోర్టులో చోటు చేసుకున్న ఈ ఘనట ఎప్పుడు జరిగిందో తెలియదుగానీ, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలోని దృశ్యాల ప్రకారం, ఓ యువతి తొలిసారిగా విమానం ఎక్కేందుకు వచ్చి, కన్వేయర్ బెల్ట్ ను చూసి, దానిపై నిలబడితే, అది విమానం వద్దకు తీసుకెళుతుందని భావించింది. తన లగేజీతో కలిసి ఒక్కసారిగా దానిపైకి దూకేసింది. బ్యాలెన్స్ తప్పి పడిపోయింది. దీన్ని గమనించిన సెక్యూరిటీ సిబ్బంది వెంటనే బెల్ట్ ను నిలిపివేసి, ఆమెను బయటకు తీశారు. అనంతరం ఆమెను ప్రశ్నించగా, దానిపై నిలబడితే, విమానం వద్దకు తీసుకెళుతుందని అనుకున్నానని చెప్పడం గమనార్హం. ఈ వీడియో చూసిన వారంతా నవ్వుకుంటూ, సరదా కామెంట్లు పెడుతున్నారు.

Turkey
Conveer Belt
Airport
  • Error fetching data: Network response was not ok

More Telugu News