Andhra Pradesh: నేను తాతల సొమ్ముతో సోకులు చేసే వేలిముద్ర గాడిని కాదు!: వైసీపీ నేత పీవీపీ

  • కేశినేని విమర్శలకు పీవీపీ కౌంటర్
  • వేలకోట్లతో వ్యాపారం చేశామని వ్యాఖ్య
  • వేలాది ఉద్యోగాలు సృష్టించామన్న పీవీపీ

ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ నేత కేశినేని నాని, వైసీపీ నేత పొట్లూరి వరప్రసాద్(పీవీపీ) మధ్య ప్రస్తుతం ట్విట్టర్ లో యుద్ధం నడుస్తోంది. తాను ఎవరికైనా బాకీ ఉంటే చెల్లిస్తాననీ, అయితే అంతకుముందు బ్యాంకులకు వేలకోట్లు ఎగ్గొట్టిన వ్యక్తి అప్పులు చెల్లించాలని కేశినేని హితవు పలికారు. దీంతో ఈ వ్యాఖ్యలపై పీవీపీ ఘాటుగా స్పందించారు.

తాను తాతల సొమ్ముతో సోకులు చేసే వేలిముద్రగాడిని కాదని పీవీపీ తెలిపారు. వేల కోట్ల రూపాయలతో వ్యాపారాలు చేసి వేలాది ఉద్యోగాలను సృష్టించామని వ్యాఖ్యానించారు. వేల కోట్లు బ్యాంకులకు అప్పులను ఎగ్గొట్టడం ఎలాగో ‘మీ గురువు’ను అడగాలని కేశినేనికి సూచించారు. ఆ రహస్యాన్ని తమకూ చెబితే ఆ కొత్త బిజినెస్ నేర్చుకుంటామని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ మేరకు పీవీపీ ట్విట్టర్ లో స్పందించారు.

Andhra Pradesh
YSRCP
Telugudesam
Twitter
pvp
Kesineni Nani
  • Error fetching data: Network response was not ok

More Telugu News