Nimmala Kristappa: టూరిజం రిసార్టులను కూడా కూల్చుతారా?: టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు

  • కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మించిన కట్టడాలను ఎలా కూల్చుతారు?
  • వైయస్ హయాంలో అనేక అక్రమ కట్టడాలు వెలిశాయి
  • అక్రమ నిర్మాణాలపై ప్రభుత్వ విధానమేంటో స్పష్టం చేయాలి

వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మించిన కట్టడాలను ఎలా కూలుస్తారని ఆయన ప్రశ్నించారు. ప్రజావేదికను కూల్చిన తర్వాత ప్రభుత్వంపై ప్రజల్లో అనుమానాలు పెరిగాయని చెప్పారు. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కరకట్టపై అనేక అక్రమ కట్టడాలు వెలిశాయని తెలిపారు. అక్రమ నిర్మాణాలపై ప్రభుత్వ విధానమేంటో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. కృష్ణా నది తీరంలోనే టూరిజం రిసార్టులను నిర్మించారని... వాటిని ప్రభుత్వం ఏం చేయబోతోందో చెప్పాలని కోరారు.

Nimmala Kristappa
Telugudesam
YSR
YSRCP
  • Loading...

More Telugu News