Pakistan: పాకిస్థాన్ క్రికెట్ చీఫ్ సెలక్టర్ పదవికి ఇంజమామ్ గుడ్ బై!

  • బోర్డు ఆదేశిస్తే కొత్త బాధ్యతలు స్వీకరిస్తా
  • సెలక్టర్ గా మాత్రం ఉండబోనని స్పష్టీకరణ
  • వరల్డ్ కప్ తరువాత ఇంజమామ్ పైనా విమర్శలు

పాకిస్థాన్ క్రికెట్ జట్టు చీఫ్ సెలక్టర్ పదవికి మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ గుడ్ బై చెప్పారు. బోర్డు ఆదేశిస్తే తాను కొత్త బాధ్యతలు స్వీకరించేందుకు సిద్ధమని, సెలక్టర్ గా మాత్రం ఉండనని ఆయన తేల్చి చెప్పారు. వాస్తవానికి ఈ నెల 30తో ఇంజమామ్ పదవీ కాలం పూర్తికానుంది. ఇటీవలి లండన్ వరల్డ్ కప్ లో పాకిస్థాన్ సెమీఫైనల్ చేరలేక పోయిన సంగతి తెలిసిందే. ఆటగాళ్ల సెలక్షన్ లో లోపాల కారణంగానే జట్టు అమరిక కుదరలేదన్న విమర్శలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఇంజమామ్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. కాగా, నెలాఖరు తరువాత ఇంజమామ్ ఒప్పందాన్ని పొడిగించేందుకు బోర్డు సుముఖంగా ఉన్నప్పటికీ, ఆయన మాత్రం అందుకు అంగీకరించకుండా, పదవి నుంచి వైదొలగాలన్న నిర్ణయానికే కట్టుబడివుంటానని ప్రకటించారు.

Pakistan
Inzamam
Chief Selector
  • Loading...

More Telugu News