Tirumala: ఇక తిరుమలలో 'బిగినింగ్ బ్రేక్' దర్శనం!

  • కొత్త బ్రేక్ దర్శన విధానం
  • స్వామి సేవల అనంతరం మొదలు
  • వీఐపీల సంఖ్యను బట్టి సమయం

తిరుమలలో ఎల్1, ఎల్2, ఎల్3 పేరిట జారీ అవుతున్న బ్రేక్ దర్శనాలను రద్దు చేసిన టీటీడీ నూతన చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, వాటి స్థానంలో 'బిగినింగ్ బ్రేక్' పేరిట సరికొత్త దర్శన విధానాన్ని వీఐపీల కోసం ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. పూర్తి స్థాయి పాలకమండలి ఏర్పడి, కొత్త నిర్ణయాలు తీసుకునేంత వరకూ బిగినింగ్ బ్రేక్ ను కొనసాగించాలని సూచించారు. ఉదయం స్వామివారికి జరిగే నిత్య సేవల అనంతరం, సామాన్య భక్తులను అనుమతించే ముందు ఈ కొత్త బ్రేక్ దర్శనం ఉంటుంది. స్వామి దర్శనానికి వచ్చిన వీఐపీల సంఖ్యను బట్టి బిగినింగ్ బ్రేక్ సమయం ఆధారపడివుంటుంది.

Tirumala
Tirupati
Bigining Break
YV Subba Reddy
  • Loading...

More Telugu News