Andhra Pradesh: 24న ప్రమాణ స్వీకారం చేయనున్న ఏపీ కొత్త గవర్నర్ బిశ్వభూషణ్‌

  • 24న ఉదయం 11:30 గంటలకు ప్రమాణం
  • ప్రమాణ స్వీకారం చేయించనున్న హైకోర్టు చీఫ్ జస్టిస్
  • 23న శ్రీవారిని దర్శించుకోనున్న బిశ్వభూషణ్‌

ఏపీ నూతన గవర్నర్‌గా నియమితులైన బిశ్వభూషణ్‌ హరిచందన్ ఈ నెల 24న ఉదయం 11:30 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆయనతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అంతకుముందు రోజు ఆయన భువనేశ్వర్ నుంచి విమానంలో తిరుపతి చేరుకుంటారు. శ్రీవారి దర్శనం అనంతరం విజయవాడ చేరుకుంటారు.

ఏపీ గత ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి క్యాంపు కార్యాలయాన్ని రాజ్‌భవన్‌గా మార్చనున్న ప్రభుత్వం అందులోని మొదటి అంతస్తును గవర్నర్ నివాసంగా, కింది భాగాన్ని కార్యాలయంగా ఉపయోగించుకునేలా తీర్చిదిద్దనుంది. గత రెండు రోజులుగా ఇందుకు సంబంధించిన మార్పు చేర్పులు చేస్తున్నారు.

Andhra Pradesh
Governer
Biswa Bhusan Harichandan
  • Loading...

More Telugu News