Prakasam District: ఒంగోలు శివారులో పార్కింగ్ చేసిన రెండు ట్రావెల్స్ బస్సులు దగ్ధం

  • త్రోవగుంట వద్ద ఘటన
  • క్షణాల్లోనే కాలి బూడిదైన బస్సులు
  • కారణాలపై పోలీసుల ఆరా

ప్రకాశం జిల్లా ఒంగోలు శివారులో పార్కింగ్ చేసిన రెండు ట్రావెల్స్ బస్సులు దగ్ధమయ్యాయి. త్రోవగుంట వద్ద ఆటోనగర్‌లో పార్కింగ్ చేసిన బస్సుల్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగి చూస్తుండగానే కాలిబూడిదయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అయితే, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. దగ్ధమైన రెండూ ఏసీ బస్సులని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

Prakasam District
Ongole
Travel buses
Fire Accident
  • Loading...

More Telugu News