Chandrababu: చంద్రబాబు పాలనలో అమరావతి అభివృద్ధి జరగలేదు: కన్నా లక్ష్మీనారాయణ

  • కాంట్రాక్టర్ల నుంచి కమీషన్లు వసూలు చేశారు
  • రైల్వే లైన్ పనులను కోడెల కొడుకు అడ్డుకున్నారు
  • ఇవన్నీ గమనించిన ప్రజలు టీడీపీకి ఓటు వేయలేదు

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనపై ఏపీ బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ విమర్శలు చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు హయాంలో రాజధాని అమరావతి అభివృద్ధి జరగలేదని అన్నారు. రైల్వే, జాతీయ రహదారుల అభివృద్ధి నిధుల్లో కాంట్రాక్టర్ల నుంచి కమీషన్లు వసూలు చేశారని ఆరోపించారు. రాజుపాలెం రైల్వేలైన్ పనులను టీడీపీ నేత కోడెల శివప్రసాద్ కొడుకు అడ్డుకున్నారని, కాంట్రాక్టర్ల నుంచి డబ్బు వసూలు చేశారని ఆరోపించారు. ఇవన్నీ గమనించిన ప్రజలు మొన్నటి ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేయలేదని, బాబు చొక్కా చించేశారని అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

Chandrababu
Telugudesam
kanna lakshmi narayana
bjp
  • Loading...

More Telugu News